Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిరిండియాలో భారీ సంఖ్యలో పైలెట్ల నియామకానికి నోటిఫికేషన్

Air India issues notification to employ 1000 pilots
Advertisement
  • టాటాల చేతుల్లోకి వెళ్లిన ఎయిరిండియా
  • ఇటీవలే 840 కొత్త విమానాలకు ఆర్డర్
  • సిబ్బంది సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారించిన ఎయిరిండియా
  • 1000 మంది పైలెట్ల నియామకానికి నోటిఫికేషన్
  • తాజాగా కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్లు, ట్రైనర్ల నియామకానికి ప్రకటన 
Advertisement
ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ తమ విమానయాన సంస్థ విస్తరణపై దృష్టి పెట్టింది. తాజాగా, 1000 పైలెట్లను నియమించుకునేందుకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎయిరిండియా ఇటీవలే రికార్డు స్థాయిలో, ప్రపంచ దిగ్గజ విమానయాన సంస్థలు విస్మయం చెందేలా, ఏకంగా 840 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి ఈ విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ క్రమంలో సిబ్బంది సంఖ్యను పెంచుకోవడంపైనా ఎయిరిండియా నూతన మేనేజ్ మెంట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 

తాజా నోటిఫికేషన్ ద్వారా కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్లు, ట్రైనర్లు సహా 1000 మంది పైలెట్లను తీసుకోనున్నారు. కాగా, ఇటీవల ఎయిరిండియా తీసుకువచ్చిన కొత్త వేతన విధానం, సర్వీసు నిబంధనలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ పైలెట్ యూనియన్లు దీనిపై అసంతృప్తితో ఉన్నాయి.
Advertisement
Advertisement
Air India
Pilots
Notification
TATA Group
India

More Telugu News